శ్రీ ఏడుపాయలలో ఆకాశదీపం ఆవిష్కరణ
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల క్షేత్రంలో మంగళవారం సాయంత్రం ఆకాశదీపాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు స్థానిక వన దుర్గ మాత ఆలయంలో ప్రదోషకాల పూజలు నిర్వహించి అమ్మవారికి అభిషేకం మంగళహారతులు, పూజలు చేశారు. స్థానికంగా ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి, ఆకాశ దీపాన్ని ఆవిష్కరించి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.