ఇన్‌స్టాలో పరిచయమై యువతికి వేధింపులు.. కేసు నమోదు

GNTR: మల్లికార్జునపేటకు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో బత్తుల సుందర్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నాక, సుందర్ నగ్న కాల్స్ చేయాలని ఒత్తిడి చేశాడు. యువతి నిరాకరించడంతో, ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు గురువారం ఆరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.