'కవి సమ్మేళనం వివరాలు వాట్సాప్‌లో పంపవచ్చు'
మన్యం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మన్యం కళావేదికగా సోమవారం సాయంత్రం 6:00 నుండి 8:00 గంటల వరకు కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది పేర్కొన్నారు. ఈ కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన వారు తమ పేర్లను నోడల్ అధికారి శ్రీ రాజు 9949996497లో నమోదు చేసుకోవాలని కోరారు. ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా కవుల వివరాలు పంపవచ్చన్నారు.