కథలాపూర్‌లో మాజీ శాసనసభ్యుని జన్మదిన వేడుకలు
JGL: కథలాపూర్ మండల కేంద్రంలో ఇవాళ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ నాయకులు కథలాపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయురారోగ్యాలతో, క్షేమంగా ఉండాలని భగవంతున్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, శంకర్, రవి పాల్గొన్నారు.