బుమ్రా ఒక 'జీనీ' లాంటివాడు: డుప్లెసిస్
బుమ్రా వంటి ఆటగాడు జట్టులో ఉన్నందుకు భారతీయులు ఎంత అదృష్టవంతులో వారికి అర్థం కావడం లేదని డుప్లెసిస్ అన్నాడు. 'ఫార్మాట్ ఏదైనా సరే.. అతడి చేతికి బంతి ఇస్తే చాలు, మీకు మ్యాచ్ గెలిపించి పెడతాడు. ఏ కెప్టెన్‌కైనా అది ఒక సూపర్ పవర్ లాంటిది. అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని రుద్దగానే 'జీనీ' ప్రత్యక్షమైనట్లు.. బుమ్రా కూడా కెప్టెన్ కోరుకున్న విజయాన్ని అందిస్తాడు' అని పేర్కొన్నాడు.