జమ్మికుంటలో అక్రమ నిర్మాణాల తొలగింపు
KNR: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లోని బాలికల వసతిగృహం పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిపై నిర్మించిన అక్రమ ఇల్లును మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.