మంత్రి తుమ్మల నేటి పర్యటన వివరాలు
KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నారని మంత్రి కార్యాలయం ఇన్‌ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి, పగిడి గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొనిజర్ల మండలంలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలిస్తారని తెలిపారు.