అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
KDP: కార్తీకమాసం సందర్భంగా ఈనెల 5న అరుణాచలం గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ RM గోపాల్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని డిపోల నుంచి ఏర్పాటు చేసిన 6 బస్సులు ఈనెల 4వ తేదీ సాయంత్రం బయలుదేరుతాయని వివరించారు. ముందస్తు టికెట్లు కావలసిన వారు ఆయా బస్టాండులోని రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.