ఘరానా దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు

ఘరానా దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రకాశం: ఒంగోలు డివిజన్ పరిధిలో రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని, రూ. 10 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో చోరీ ఘటనలో 158 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.