ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: మందస మండలం వీరగున్నపురంలో నిర్వహించిన శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయం ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే శిరీష బుధవారం పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమంలో ఆమె పాల్గొన్నారు.