ఎక్స్‌కు భారీ జరిమానా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'కు యూరోపియన్ యూనియన్ భారీ షాక్ ఇచ్చింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం(DSA) నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలడంతో ఏకంగా 120 మిలియన్ యూరోల జరిమానా విధించింది. ఎక్స్ బ్లూ టిక్ కోసం 8 డాలర్లు చెల్లిస్తే ఎవరికైనా ఇస్తుందని ఆరోపించింది. దీనివల్ల నిజమైన వినియోగదారులను, ఫేక్ అకౌంట్లను గుర్తించడం కష్టమవుతుందని పేర్కొంది.