ఆగిరిపల్లి ఎస్సై హెచ్చరికలు

ELR: ఆగిరిపల్లి గ్రామం నుండి నూగొండపల్లి గ్రామం వెళ్లే రహదారిలో కుంపిని వాగు వద్ద పోలీసులు శనివారం రాత్రి పహారా కాశారు. గ్రామంలో కుంపినీ వాగు పొంగిపొర్లుతూ ఉండడంతో పెను ప్రమాదం సంభవించనున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశంతో ప్రజలను అప్రమత్తం చేశారు. ఆగిరిపల్లి ఎస్సై శేఖర్ మాట్లాడుతూ.. వాగు పొంగుతున్న నేపథ్యంలో ఎవరు ఇటుగా ప్రయాణించవద్దంటూ హెచ్చరించారు.