'నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు'

KMR: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కఠిన చర్యలు తీసుకున్నారు. గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో అలసత్వం వహించిన రాజంపేట SHO దత్తాద్రి గౌడ్‌ను హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న రాజుకు ఎస్సైగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేశారు.