యూరియా కూపన్ల జారీపై చెలరేగిన వివాదం

KMM: కామేపల్లి రైతు వేడుకలో యూరియా కూపన్ల జారీ ఆలస్యంపై వివాదం చెలరేగింది. ఈ సంఘటనపై శుక్రవారం ఏఈవోలు శ్రీకన్య, రవి కుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న తమపై అరుస్తూ, నాలుగు సార్లు దరఖాస్తు చేసినా యూరియా కూపన్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ జాస్తిపల్లి రైతు రాయల కృష్ణపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.