IBOMMA కేసుకు కోడి కత్తి లాయర్
HYD: IBOMMA పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు కోసం లాయర్ సలీం రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవికి ప్రజల నుంచి హీరో తరహా మద్ధతు లభిస్తోందని, చట్ట ప్రకారం అతడి హక్కుల కోసం పోరాడతానని అన్నారు. గతంలో ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ 'కోడి కత్తి' గులక రాయి కేసుల్లోని ముద్దాయిల తరుఫున వాదించి బెయిల్ ఇప్పించిన విషయం తెలిసిందే.