చిత్తడి రోడ్లు.. చితికిన బతుకులు

చిత్తడి రోడ్లు.. చితికిన బతుకులు

ADB: అసలే గిరిజన గ్రామాలు.. తారు రోడ్లుండవు.. బస్సులూ వెళ్లవు. ఆపదొస్తే బురదదారిలో ఆటోల్లో బతుకు బండి లాగాల్సిందే. ఏ పని ఉన్నా మండలకేంద్రానికి రాకపోకలు సాగించాలంటే అవస్థలు పడాల్సిందే. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉన్న మట్టి రోడ్లు బురదమయం అయ్యాయి. రాకపోకలు కొనసాగించే వీలూ లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలి అని కోరుతున్నారు.