పొడ్స బ్రిడ్జ్‌పై నుంచి రాకపోకలు నిలిపివేత

పొడ్స బ్రిడ్జ్‌పై నుంచి రాకపోకలు నిలిపివేత

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండలం వెంకటరావు పేట సమీపంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు పెన్ గంగా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పొడ్స బ్రిడ్జ్‌పై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో వెంకట్రావుపేట వైపు నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. పరిసరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.