మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు

ASR: మిరియాలు, పసుపు పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు. గురువారం స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బీ.కళ్యాణి ఆధ్వర్యంలో మిరియాలు, పసుపు పంటల సాగుపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సేంద్రీయ పద్ధతిలో మిరియాలు సాగు చేయాలని రైతులకు సూచించారు.