సకాలంలో దరఖాస్తుల పరిష్కారం: జాయింట్ కలెక్టర్
ATP: మ్యుటేషన్, పీజీఆర్ఎస్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నుంచి రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వే పనులు లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, రైతుల సమక్షంలో ఈకేవైసీ చేపట్టాలని సూచించారు.