పెన్షన్లను పంపిణీ చేసిన కలెక్టర్

పెన్షన్లను పంపిణీ చేసిన కలెక్టర్

VZM: జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను కలెక్టర్ రామ సుందర్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. స్థానిక కంటోన్‌మెంట్ వద్ద ఉన్న వారణాసి పద్మావతి ఇంటికి స్వయంగా వెళ్ళి పింఛను చేతికందించి, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ వద్ద ఉన్న DRDA కార్యాలయంలోని కంట్రోల్ రూంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.