ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నంకి చెందిన జనసేన నాయకులు గేదెల చైతన్య ఏపీ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో గురువారం సన్మాన సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొని చైతన్యను శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.