రేపటి నుంచి NTR 'డ్రాగన్' షూటింగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'డ్రాగన్'. దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత, ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ తాజా షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ ప్రాజెక్టులోని తొలి పార్ట్ 2026 జూన్ 25న విడుదల కానుంది.