VIDEO: భావోద్వేగానికి గురైన భారత ప్లేయర్లు
ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ప్లేయర్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అద్భుతమైన సెంచరీ (127*)తో చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. లక్ష్యాన్ని ఛేదించగానే.. కెప్టెన్ హర్మన్‌తో పాటు ఇతర ప్లేయర్లు, ఫ్యాన్స్ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. WC కోసం చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నామని హర్మన్ వెల్లడించింది.