'అర్హత గల మహిళలందరికీ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయాలి'
KMR: అర్హత గల మహిళలందరికీ ప్రభుత్వం చీరలను పంపిణీ చేయాలని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం చీరలు ఇస్తామనడం సబుబు కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన బతుకమ్మ చీరలు ఇప్పుడు పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.