VIDEO: బీర్ బాటిల్‌లో చెత్త
WGL: చిల్డ్ బీర్ తాగి సేదతీరుదామనుకున్న ఓ యువకుడికి వింత అనుభవం ఎదురైంది. వర్ధన్నపేట పట్టణంలోని అక్షయ బార్‌లో ఆదివారం బీరు కొనుగోలు చేసి, మూత తీసి గ్లాస్‌లో పోసుకుని తాగుతుండగా బాటిల్లో భారీగా చెత్త కదులుతున్నట్లు గమనించాడు. ఒక్కసారిగా అవాక్కైన యువకుడు దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.