'సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

KKD: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గొల్లప్రోలు ప్రభుత్వ వైద్య అధికారిణి డాక్టర్ సునీత సూచించారు. పీహెచ్సీలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందితో బుధవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని డాక్టర్ సునీత ఆదేశించారు.