'నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి'

MDK: సీఎం సహాయ నిధి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేశ్ అన్నారు. రామాయంపేట మండలం కాట్రియాలలో బుధవారం అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందిన ముగ్గురు లబ్ధిదారులు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో మంజూరైన రూ.1.20 లక్షల విలువైన చెక్కులను అందించారు.