లోక్ అదాలత్‌లో 3,787 కేసుల పరిష్కారం

SDPT: జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,787 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పరిష్కరించదగిన క్రిమినల్ కేసుల్లో 3,733 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మిలింద్ కాబ్లే, సంతోశ్ కుమార్, సాధన తదితరులు పాల్గొన్నారు.