'సమస్యాత్మక గ్రామాల్లో విగ్రహాల వద్ద బందోబస్తు'

NDL: వినాయక చవితి పండగ దృష్టిలో ఉంచుకుని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.