'హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే'

'హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే'

VKB: హిందూ దేవి దేవతలను విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని తాండూర్ బీజేపీ నేత రజినీకాంత్ డిమాండ్ చేశారు. ఓట్లు అడిగేటప్పుడు దేవుళ్లకు పూజ చేస్తూనే ఇలాంటి విమర్శలు చేయడం హిందూ సమాజాన్ని కించపరచినట్లేనని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సీఎం సభలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలన్నారు.