ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

నల్లగొండ మండలం జీ. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమ అసలైన విజయమన్నారు. రైతు సోదరులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.