కార్మికులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

కృష్ణ: నూజివీడు మండలం తుక్కులూరులోని కోరమండల్ పెయింట్స్ ఫ్యాక్టరీలు లీగల్ అవేర్నెస్ క్యాంపు గురువారం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ పెదకాసిం మాట్లాడుతూ.. కార్మికులకు ఉన్న చట్టాలపై అవగాహన పెంపొందాలన్నారు. హక్కులు, చట్టాలు ప్రతి కార్మికుడు తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు. ఏఐటియుసి నేత నిమ్మగడ్డ నరసింహ, రామిశెట్టి బాలాజీ, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.