షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
VKB: మోమిన్‌పేట్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో కుమ్మరి లక్ష్మి అనే మహిళ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, బట్టలు, బీరువాలో దాచిన నగదు సహా ఇతర సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన వల్ల బాధితురాలు లక్ష్మీ కన్నీటి శోకంలో మునిగిపోయింది.