రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రకాశం: గిద్దలూరులోని స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి లింగాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.