పంచలింగాలలో టీడీపీ కార్యకర్త మృతి

పంచలింగాలలో టీడీపీ కార్యకర్త మృతి

KRNL: కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన నందీశ్వర్ రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎంపీ నాగరాజు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నందీశ్వర్ రెడ్డి మరణం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంపీతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.