మండలంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

మండలంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

E.G: పి.గన్నవరం మండలంలోని రాజవరం -పొదలాడ రోడ్డు వెంబడి కాలవ చెంతన ఆక్రమించుకుని కట్టిన అక్రమ కట్టడాలు, బడ్డీలను అధికారులు మంగళవారం తొలగిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ స్థలాలలో చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న తమ దుకాణాలు తొలగించడం వల్ల రోడ్డున పడ్డామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యమ్నాయ మార్గం చూడాలని వారు కోరుతున్నారు.