యువతులను వేధిస్తే ఫోన్ చేయండి: సీఐ

యువతులను వేధిస్తే ఫోన్ చేయండి: సీఐ

KMR: యువతులను ఎవరైనా వేధిస్తే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. యువతులను యువకులు, ఇతరులు వేధింపులకు గురి చేస్తే షీ టీం ప్రతినిధులకు తెలియజేయాలని తెలిపారు. వేధించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.