సైనికులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు: ట్రంప్
ఇరాన్‌లోని వందల లక్ష్యాలపై దాడులు చేసినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేసినట్లు తెలిపారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు టెహ్రాన్ సైనికులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.