'తర్వాత సంజూకే T20 టీమ్ పగ్గాలు'
భారత T20 జట్టు సారథిగా సూర్య తర్వాత, ఆ బాధ్యతలను సంజూ శాంసన్ అందుకునే ఛాన్స్ ఉందని మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికి సూర్య ఫిట్‌గా ఉన్నాడని, ఒకవేళ అతను తప్పుకుంటే సంజూ సరైన వ్యక్తి అని పేర్కొన్నాడు. IPLలో రాజస్థాన్ రాయల్స్‌ను సుదీర్ఘకాలం నడిపించిన అనుభవం, మెరుగైన బ్యాటింగ్ స్కిల్స్ వల్ల భవిష్యత్తులో అతనే టీమిండియా కెప్టెన్ కావొచ్చని తెలిపాడు.