'గైర్హాజరు పేరుతో కార్మికులను తొలగించే కుట్ర'
MNCL: సింగరేణి యాజమాన్యం గైర్హాజరు పేరుతో కార్మికులను విధుల్లోంచి తొలగించేందుకు కుట్ర పన్నుతోందని HMS యూనియన్ నాయకులు ఆరోపించారు. బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాజాబాబు ఆదివారం మాట్లాడుతూ.. ఏడాదిలో 150 మస్టర్లు ఉంటేనే కొనసాగించాలనే సర్కులర్ దారుణమన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న ఈ సర్కులర్‌ను తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.