నేడు విద్యుత్ సరఫరా బంద్
HNK: దామెర మండల కేంద్రంలోని 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్‌లో నెలవారీ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సహాయ ఇంజనీర్ గుర్రం రమేష్ తెలిపారు. శనివారం ఉ.9 గంటల నుంచి 11గం. వరకు సబ్ స్టేషన్ పరిధిలోని దామెర, ల్యాదెళ్ల, వెంకటాపూర్, సింగరాజుపల్లి, ఒగ్లాపూర్, దమ్మన్నపేట, తక్కళ్లపాడు, ముస్త్యాలపల్లి గ్రామాల్లో విద్యుత్ ఉండదన్నారు.