VIDEO: మైనింగ్ శాఖ అధికారుపై సర్పంచ్ దాడి
MNCL: చెన్నూరు మండలం అబ్బాయాపల్లిలో అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణాను మైనింగ్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ 20 మంది అనుచరులతో మైనింగ్ శాఖ అధికారులపై దాడికి దిగాడు. వారి 100 డయల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన సర్పంచ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.