VIDEO: వనపర్తిలో న్యాయవిజ్ఞాన సదస్సు
WNP: చట్టాలపై ప్రజలకు, వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య అన్నారు. శుక్రవారం వనపర్తిలోని కర్రెమ్మ గుడి ప్రాంతంలో ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం గురించి వివరించారు