VIDEO: చంద్రగ్రహణం నేపథ్యంలో పాలకుర్తి హరిహర క్షేత్రం మూసివేత
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం నిత్యపూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు దేవస్థానం ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు.