ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: కౌతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రాము మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్, ఫార్మసీ, ఇతర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.