తాండూరు పట్టణంలో రోడ్డుపై నిరసన
VKB: తాండూరు పట్టణం వార్డు నం. 7 రాయల్ కాంట ప్రాంతంలో రోడ్డును వేయాలని కాలనీవాసులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్వానంగా మారిన రోడ్డును జేసీబీతో తవ్విస్తూ రోడ్డు మధ్యలో బైఠాయించి నిరసన తెలిపారు. రాయల్ కాంట నుంచి మసీదు లోపలికి వెళ్లే మార్గం తీవ్రంగా దెబ్బతిన్నా, అధికారులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.