నేటి నుంచి బీసీల కృతజ్ఞతా ర్యాలీలు

కృష్ణా: బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ నేటి నుంచి నాలుగు రోజులపాటు కృతజ్ఞతా ర్యాలీలు నిర్వహించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నేడు, రేపు కల్లు గీత కార్మికులతో సమావేశాలు, 11న చేనేత దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీలు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌పై షాపుల అలంకరణ ఉంటుందని చెప్పారు.