VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కోనసీమ: అమలాపురం ఎత్తు రోడ్డు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అల్లవరం మండలం గోడికి చెందిన రేవు దినేశ్ కుమార్ (27) అనే యువకుడు మృతి చెందాడు. బైక్‌పై గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తుండగా రాజోలు వైపు వెళ్తున్న RTC బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.