రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ప్రకాశం: కంభంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.