పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి..!
MDCL: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్టోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. జిల్లాలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు నగరంలోని చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.